శృంగారం ప్రకృతి నియమం

సృష్టి జరగడం కోసం స్త్రీ,పురుషులు కలిసేలా ప్రకృతి ఏర్పాటు చేసిన సహజ ప్రక్రియే శృంగారం .
స్త్రీ,పురుషులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.అందరిదీ ఒకటే ఆకృతి అయినా అంగాంగం లో ఒకరికీ మరొకరికీ ఎంతటి ఎంతమార్పు. ఏ ఒక్కరూ మరొకరిలా ఉండరు. ఒకరిని పోలి మరొకరు ఉంటే సమాజంలో ఎన్నో అవాంచనీయ సంఘటనలు జరుగుతాయి.ప్రకృతిలోని ప్రతిదాన్ని సృష్టి ఓ క్రమ పద్దతిలో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం. సృష్టించింది.స్త్రీ ,పురుషుల్లో కామసంబంధమైన కోరికలు కలగకపోతే పునరుత్పత్తి జరగదు.శృంగారం సృష్టికీ ,సంపూర్ణమైన సంతృప్తికీ కారణం.
ఆదిమ కాలంలో సుఖమే గనుక ఇవ్వక పోతే శారీరికంగా బలహీనురాలైన స్త్రీని బలవంతుడైన పురుషుడు ఎప్పుడో చంపేసేవాడు.
ప్రకృతినుండి శివ,శక్తి రూపాలను విడదీయలేం. ప్రకృతిలోని అనేక రూపాలు లింగాకారాన్ని ,స్త్రీ అంగాన్ని పోలి ఉంటాయి.