
Lord Balaji
తిరుమల అత్యంత ప్రాచీనమైనది. తిరుచానూరు ప్రాచీనమైనది.తిరుపతి నవీనమైనది.
తిరుమల పూర్వము తిరువేంకటాద్రిగా పిలువబడేది.
తిరుపతిని రామానుజాచార్యులు నిర్మించారు. అంతకు ముందే ఈ ప్రదేశములో ఒక చిన్న గ్రామము ,అందులో పార్థసారధిస్వామి వారి ఆలయము ఉండేది.
తిరుచానూరు అప్పట్లో తిరుశుకనూరు గా పిలువబడేది.తిరుపతి పుట్టకముందు వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహన అంతా తిరుచానూరు నుండే జరుపబడేది. అందుకోసం తిరుచానూరులో ఒక గ్రామసంఘము ఉండెది.తర్వాత అందరూ తిరుపతిలో నివసించడము ప్రారంభించారు.
తిరుమలకు దక్షినంగా ఐదు మైళ్ళదూరంలో , తిరుపతికి పశ్చిమంగా ఏడు మైళ్ళదూరంలో చంద్రగిరి ఉంది.
తిరుపతి నుండి తిరుపతికి కాలినడకన వెలుతుంటే మొదటగా అలిపిరి అనే ద్వారం వస్తుంది. దీనిని తొలుత ఆదిపడి అని పిలిచేవారు. అంటే తొలి అడుగు అని అర్థం.
తిరుమలకు తిరుపతి నుండి ,చంద్రగిరి నుండి తూర్పుగా మామండురు నుండి ,పశ్చిమాన నాగపట్ల గ్రామము నుండి నాలుగు దారులు కలవు. ఇంకా అనేక కాలిబాటలు కలవు. అవన్నీ నేడు సంచారం లేక ప్రాముఖ్యత కోల్పోయాయి.
తిరుమలకొండలవరుస తూర్పు కనుమల లోనిది. వెంకటేశ్వరుడు కొలువై ఉన్న ఏడుకొండలు ఎంతో పవిత్రమైనవని అందరి చేత భావించబడుతుంటాయి.

Talakona Waterfall
తిరుమల కొండలలో ప్రవహించే మొదటి జలపాతం తలకోన.అందుకె తలకోన అని పిలుస్తారు. తలకోన ప్రాంతం లో సిద్దేశ్వరాలయం ఉంది.
కొండపైన స్వామి ఆలయానికి సమీపంగా రెండు జలపాతాలు ఉన్నాయి. తూర్పున పాపవినాశనం.అవాచారికోన ఆగ్నేయంగా ప్రవహిస్తుంటుంది.
పాపవినాశన జలపాతంలో స్నానం చేస్తే తమ పాపాలన్నీ పోతాయని భక్తుల విశ్వాసం. ఆకాశగంగ ప్రాతం సాక్షాత్తూ శ్రీస్వామి వారిచే ఏర్పరచబడ్డట్టుగా చెప్పుకుంతారు.
పసుపు తీర్థము , కుమారతీర్థము ,రామక్రిష్ణ తీర్థము ,తుంబురుకోన , జాబాలి, ఆకాశగంగ, పాపవినాశనము, సనకసనందన,తీర్థాలు తిరుమల నందు ఎంతో ప్రాముఖ్యత కలిగిన తీర్థాలు.
తుంబురుకోన కు ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది.ఇక్కడ జలపాతము చాలా త్తు నుండి నిట్టనిలువుగా పడుతుంది. నల్లరాతి బండల నుండి ఎంతో స్వచ్చంగా ప్రవహిస్తుంది.ఇక్కడఒక గుహ ఉంది. ఆ గుహ నుండి శ్రీవారి ఆలయమునకు మార్గము ఉందని చెప్పుకుంటారు.

Srirangam Temple Complex
14 వ శతాబ్ధములో ముస్లిం రాజుల దండయాత్రకు శ్రీరంగం లో కొలువై ఉండే శ్రీరంగనాథుడు గురైనాడు.ఆ సమయంలో ఉత్సవ మూర్తిని తీసుకుని తిరుమలకు చేరాలని ప్రయత్నించారు. తుంబురు కోన దారిలో వెళ్తూ విగ్రహాన్ని మోసే వ్యక్తి విగ్రహంతో సహా లోయలో పడిపోయాడు.దైవాంశ వల్ల అప్పటికే అక్కడ ఒక ఆలయం నిర్మించబడి ఉంది. అందువల్ల శ్రీరంగనాథుడు కొంతకాలం అక్కడ కొలువై పూజలందుకున్నాడు.ఈ చరిత్రకు సాక్షంగా తుంబురుకోన జలపాత ప్రవాహ మధ్యంలో ఒక మంటపం కనపడుతూ ఉంటుంది.
అతి ప్రాచీనమైన తిరుమల సంభ్రమాన్ని కలిగించే ఎన్నో విశేషాలకు నిలయం.