newstirupati.ccom home
ఎన్నడూ చూడని ఒక కొత్త లోకానికి వెళ్ళాలనుకుంటున్నారా .. అయితే వెళ్ళండి .."అవతార్"కు.

avatar

ఇక మనుషులతో పని లేకుండా చిన్నపిల్లల సినిమాలు కాకుండా సజీవమైన పెద్దలసినిమాలు తీయచ్చు.కావలసిందల్లా కంప్యూటర్లు , యానిమేషన్ నిపుణులూ.దర్శకులు స్టార్లతోటీ ,వాళ్ల రాజరిక పోకడలతోటీ సఫర్ అవ్వాల్సిన పని లేదు.దర్శకులు తమ ఊహలకు అనుగుణంగా కంప్యూటర్లలో తయారుచేసిన పాత్రలతో సంపూర్ణమైన పెద్దలు ఎంజాయ్ చేసే సినిమా తీయచ్చు.ప్రపంచవ్యాప్తంగా
సినీ దర్శకులకు ఈ నమ్మకం బలంగా కలిగించిన సినిమా "అవతార్".
ఔరా..కంప్యూటర్లలో తయారుచేసిన బొమ్మలు నిజమైన మనుషుల లాగా ఇంత సజీవంగా ఉంటారా ,అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఆ పాత్రలతో ప్రేమలో పడిపోతున్నారు.నటీ నటుల గొంతెమ్మ కోర్కెలకు , హవాలకు రాబోతున్నది గడ్డుకాలం.తలలెగరేసిన ప్రతి నటీ నటుడ్నీ పక్కనపెట్టి దర్శకుడు ఆ పాత్రను సజీవంగా కంప్యూటర్లో సృష్టించుకుంటాడు.ప్రజలతో తన భావాలను పంచుకుంటాడు. కొంతకాలంగా యానిమేషన్ సినిమాల హవా కొనసాగుతున్నా కృత్రిమ పాత్రలతో లైవ్ సినిమాలా తీసి మెప్పించడం కేమెరూన్ కే సాధ్యమైంది.నిస్సందేహంగా ఇన్ని సంవత్సరాల సినిమా చరిత్రలో ఇదొక కీలకమైన మలుపు.అవతార్ ఒక చరిత్ర సృష్టించిన సినిమా.జేంస్ కామెరూన్ ఒక శకావిష్కర్త.సినిమా టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తి.
కథ విషయానికి వస్తే సాధారణమైన కథే.బలవంతుడు బలహీనుడిని దోచుకోవాలని ప్రయత్నించడం మనం ప్రతి చోటా చూస్తున్నదే. ఆ లైన్ కు కామెరూన్ జోడించిన కొత్తదనం ఏమిటంటే కథా ప్రదేశం ఇతర గ్రహాన్ని తీసుకోవడం. అది కూడా కాదు కొత్తదనం , ఆ గ్రహాన్ని మనం, కనీ వినీ ఉండని విధం గా కళ్ళముందు సజీవంగా నిలపడం. అంతకంటే కొత్తదనం ఏమిటంటే ఆ గ్రహాంతరవాసుల్ని సాధారణ ఆర్టిస్టులతో నింపకుండా పూర్తిగా కంప్యూటర్లో కృత్రిమంగా తయారుచేయడం.వాళ్ళు నిజమేనేమో అని మనల్ని నిజంగా నమ్మించడం.
ఆ హీరో హీరోయిన్లను మనుషులు కారంటే నమ్మలేం .మనం వారిని ప్రేమించేస్తాం.హేట్సాఫ్ టు కామెరూన్.
మొదటి సగంలో ఆ విజువల్స్ ని మైండ్ తట్టుకోలేక తలనొప్పి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఆ కాన్వాస్ ఏమిటో .అదొక వింత లోకం.ఊహల్లో కూడా దర్శించలేని లోకం. అలాంటి లోకాన్ని కళ్ళముందు నిలిపిన కామెరూన్ మరో బ్రహ్మ తో సమానం.
టెక్నాలజీలో వంక పెట్టలేని దర్శకుడు వర్మ.అతనే ఇలాంటి చిత్రాన్ని ముప్పై ఏళ్ళలో చూడలేదు, ఇక ముప్పై ఏళ్ళలో చూడబోను ." అన్నాడంటే అవతార్ తెక్నాలజీ గురించి ఊహించవచ్చు,
ఈ సినిమాను మామూలు సినిమా హాల్స్ లో చూడడం వేస్ట్.ఐమాక్స్ లో , అదీ త్రీ డి లో చూస్తేనే నిజంగా అనుభవించినట్లు.
వర్మ చెప్పినట్లు ఈ సినిమాను చూడద్దు.. అనుభవించండి.పైరసీ సీడీలలో కాదు సుమా..మంచి థియేటర్లలో .

-19-12-09