newstirupati.ccom home
ఈ అంతర్యుద్దం నుంచి ఈరాష్ట్రాన్ని కాపాడు దేవుడా''

గత వారం రోజులుగా తిరుపతిలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్నబంద్.ఆ కారణంగా సాధారణ జన జీవనం మొత్తం స్తంభించిపోయింది.
బస్సులు నడవడం లేదు.బ్యాంకులు,ఏటి యం లు లేవు.బడులు లేవు. మార్కెట్లో కూరగాయలు రెండు రెట్లు పలుకుతున్నాయి .రోజు వారీ కూలీలకు పని లేదు.వ్యాపారస్తులకు వ్యాపారంలేదు.ఉన్న మారాజుల సంగతి పక్కన పెడితే సామాన్య జనం అల్లాడిపోతున్నారు.
దీనికి ఒక సజీవ సాక్షం ఈ రోజు జరిగింది.స్థానిక మునిసిపల్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు రోజూ ధర్నా చేస్తున్నారు. అందువల్ల మునిసిపల్ ఆఫీస్ లోని కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి.
ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలు సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ మునిసిపల్ అఫీస్ముందు ధర్నా చేస్తున్నాయి. ఈ రొజు స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి కూడా ఉధ్యమానికి మద్దతు తెలుపుతూ తిరుపతి వస్తున్నాడు. అందరూ మునిసిపల్ అఫీస్ ముందు గుమికూడారు. మధ్యాహ్నం రెండవుతోంది. అఫీస్ లోపల టీ స్టాల్ ముందుఉన్నాం. ఆ టీ స్టాల్ లో లెమన్ టీ బాగుంటుంది. ఇంతలో ఒకతను చిన్న ప్లాస్టిక్ సంచీతో వచ్చాడు. యువ పార్టీ కార్యకర్తలకు భోజనాలుపంచుతున్నాడు. అది చూసి ఒకతను వేగంగా వారిదగ్గరకు వెళ్ళాడు. ఆత్రంగా ఒకపాకెట్ అడుగుతున్నాడు. వారెవ్వరూ ఇవ్వడం లేదు.అతన్ని చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది..అతను ఎంతో ఆకలితో ఉన్నాడని.అయితే పార్టీ నాయకులకు పక్కవాళ్ళ ఆకలితో ఏం పని.
అదే సమయంలో చిరంజీవి వచ్చాడు.అందరూ అటు పరిగెట్టారు.అంతవరకూ పలచగా ఉన్న ఆ ప్రాంగణం నిమిషాల్లో జనసంద్రమైపోయింది. ఒకతను అంటున్నాడు.చిరంజీవికి ఏం తగ్గలేదుబా ..క్రేజు..అని. మరొకతనుఅంటున్నాడు.నిన్న మోహన్ బాబు వస్తే పదిమంది రాలా ..ఇప్పుడు చూడుబా...అని. అది నిజం చేస్తూ ఇల్లళ్ళోని ఆడవాళ్ళతో సహా ఎక్కడివారక్కడ పనులు ఒదిలిపెట్టి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. గుంపులో ఉన్న చిరంజీవిని ఎగిరెగిరి చూస్తున్నారు. "ఏమయా చిరంజీవీ ..ఎమ్మెల్ల్యేగా గెలిచిపోయావు.ఎదో చుట్టపు చూపుగా వచ్చిపోవడం తప్ప ఇక్కడ అభివృద్ది కోసం ఏం చేస్తున్నావు."అని వీళ్ళల్లో ఏ ఒక్కరైనా అడిగితే ఎంత బాగుండు. ఇంతలో టాటాలు చెప్పి చిరంజీవి వెళ్ళిపోయాడు. జనం కూడా టాటాలు చెప్పడం ప్రారంభించారు. చెబుతూనే ఉన్నారు...అతను వెళ్ళిపోయి చాలాసేపైనా.
మనవాడు మాత్రం ఆకలితో బాధపడుతూ అలా పిచ్చిచూపులు చూస్తున్నాడు. నాయకులు మాత్రం "జై సమైక్యాంద్ర" అంటు నినదిస్తున్నారు.
నేను అతని దగ్గరకు వెళ్ళీ ఏమిటి సంగతి ,అని అడిగాను.
మునిసిపల్ ఆఫీస్ కి బర్తు , డెత్తు సర్టిఫికేట్ల కోసం వచ్చేవారికి పత్రాలు రాస్తూ దళారీగా చేస్తూ బ్రతుకుతుంటాను. ఈ బందు వల్ల జనం రావడం లేదు. పదిరోజులుగా పని లేదు.రెండురోజులుగా తిండి లేదు...ఇది అతను చెప్పిన సంగతి.
అన్నం తినమని నేనొక ఇరవై రూపాయలిచ్చాను.
కేసీఆర్ నుంచి , కాంగ్రెస్ నాయకులనుంచి ,ఈ అంతర్యుద్దం నుంచి ఈరాష్ట్రాన్ని కాపాడు దేవుడా'' ..అనుకుంటూ అక్కడి నుంచి సాగాను.