newstirupati.ccom home
History of Andhra - 1

ఆంధ్ర చరిత్ర-1
తెలుగు వారి మధ్య ఆంధ్ర, తెలంగాణ అనే చిచ్చు మరో కాశ్మీర్లా రగులుతున్న ఈ సందర్బంలో మన చరిత్ర గురించి ఆలోచించడం ఎంతో అవసరం.
భారత దేశ భూభాగం ప్రధానంగా నాలుగు భాగాలుగా ఉంది.
అవి: పర్వత మండలం ,గంగ-సింధు మైదానం, ఎడారిప్రాంతం, ,దక్కను పీఠభూమి.
దక్కను పీఠభూమిలో అధిక భాగం ఆక్రమించిన ప్రదేశమే మన తెలుగు గడ్డ.దాన్నే మనం ఆంధ్రప్రదేశ్ అంటున్నాం.
త్రిలింగాలు అనగా ద్రాక్షారామం, కాళేశ్వరం ,శ్రీశైలం కొలువున్న ప్రాంతం కనుక ఆంధ్రదేశాన్ని త్రిలింగదేశం అనేవారు.అదే తెలుగుదేశం గా మారింది.తెలుగు ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి మనం తెలుగువారిగా పిలవబడ్డాం.
దక్కన్ అంటే దక్షిణం. దక్షిణ దిక్కున నివసిస్తున్నాం కాబట్టి తెలుగువారిని దక్షిణాదివారు అంటారు.
క్రీస్తు పూర్వం 1500-1000 సం. కాలంలో దక్కను ప్రాంతాన్ని దండకారణ్యం అనేవారు.
క్రీ.పూ . 800.లో రచించిన ఐతరేయ బ్రాహ్మణంలో దక్షిణాపథంలో నివసించిన ఆంధ్రులు అనే తెగ గురించి వివరంగా ఉంది.
ఆంధ్రుల ప్రస్తావన అశోకుడు చెక్కించిన శిలాశాసనాలలో లభ్యం అయింది.
క్రీస్తు శకం 1 వ శతాబ్ధం లో పిన్లీ అనే చరిత్రకారుడు 30 గొప్ప పట్టణాలు ,లక్షమందిసైనికులు ,రెండువేలమంది అశ్విక దళం ,వెయ్యి ఏనుగులు కల ఒక ఆంధ్ర రాజు గురించి రాశాడు.
తెలంగాన లోని మెదక్ జిల్లాలో ,హైదరాబాద్ కు 43 మైళ్ళ దూరాన ఉన్న కొండాపూర్ ఈ పట్టణాల్లో ఒకటి అని గ్రీకు చరిత్రకారులు స్పష్టం చేశారు.