newstirupati.ccom home
జీవయాత్ర

రామయ్య పని మీద పట్నం వెళ్ళాడు.
ఓ చూడరాని దృశ్యం చూశాడు.
ఒక వ్యక్తి స్కూటర్ మీద వెళుతుండగా వేగంగా వస్తున్న ఆటో గుద్దేసింది. అతను కిందపడి చూస్తుండగానే చనిపోయాడు.ఒక్క రక్తం చుక్క కారలేదు.ఏ తగలరాని చోట దెబ్బ తగిలిందో తెలియదు.
రామయ్య ఇంటికొచ్చినా ఆ సంఘటన మరవలేకపోయాడు.
'మనిషి జీవితం ఇంతే కదా.ఈ క్షణం ఉన్నవాడు రేపు లేడు.మరు క్షణం లో ఏ దిక్కు నుంచి మృత్యువు వస్తుందో తెలియదు.కాలాన్ని ఏ ఒక్కరూ ఊహించలేరు.కానీ మరు నిమిషంలో చనిపోయే మనిషి కూడా ఉరుకులు పరుగులు పెడుతుంటాడు.ఈ రోజు ఉన్నవాడ్ని రేపు ఉంటానన్న నమ్మకం ఉందా!' అని రకరకాలుగా ఆలోచించాడు.
ఆ అలోచన లోంచి అతనికి ఒక వైరాగ్యం లాంటిది కలిగింది,
అది అంతా గమనిస్తున్నాడు అతని మిత్రుడు భూషణం .
'ఒరే రామయ్య ! జీవితం శాశ్వతం కాదురా.మనం ఏ నిమిషం ఎందువల్ల పోతామో తెలియదు.అప్పటిదాకా బాగున్నవాడు కూడా అకస్మాత్తుగా పోవచ్చు.అయితే అది తలుచుకుంటూ మన పని మానేయకూడదు.చచ్చే దాకా బ్రతకడమే జీవితం అంటే.బ్రతకడమంటే ఎదో కాదు ..పని చేసుకుంటూ పోవడమే.అందుకే మన పెద్దోళ్ళు చెప్పారు..పనిచేసుకుంటూ పోవయా,ఫలితం గురించి ఆలోచించకూ అని. మన చేతిలో లేని రేపటి గురించి ఆలోచన ఎందుకు!మన చేతిలో ఉన్న ఇప్పటి పని గురించి ఆలోచించు. అయితే రేపు అనేది శాశ్వతం కాదన్న సంగతి గుర్తుంచుకో .అప్పుడే నువ్వు చెడు పనులు చేయవు.' అన్నాడు.
ఆ మాటల్లో ఉన్న అంతరార్థం గురించి ఆలోచిస్తూ లేచాడు రామయ్య.పొలం దిశగా సాగాడు.
*******************