newstirupati.ccom home
మాటే మంత్రము.

మాటే మంత్రము.
మాటను మంత్రం అని ఊరికే అనరు
.మాట చాలా మాయలు చేస్తుంది.సరిగా మాట్లాడితే అభిమానించేటట్లు చేస్తుంది.అడ్డదిడ్డంగా మాట్లాడితే దెబ్బలు తినేటట్లు చేస్తుంది.అందమైన అమ్మాయిలెప్పుడూ తీయని మాటలకే దాసోహం అయిపోతుంటారు.
ఒక వ్యక్తికి విలువ పెరిగేదీ , తరిగేదీ మాట వల్లే .అందుకే ఆచి ,తూచి మాట్లాడమని అంటుంటారు.
ఇంత శక్తి ఉండే మాట మన అదుపులో ఉండేది గొంతు దాటనంతవరకే .ఒక సారి నోరు దాటిందా అది విశ్వరూపం చూపిస్తుంది.
అందుకే పెద్దలు అంటారు. కాలు జారినా తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం అని.
కాబట్టి మట్లాడే ప్రతి మాటా బాగా ఆలోచించి మాట్లాడాలి.