newstirupati.ccom home
వైఎస్సార్ మరణం: ఏది నిజం?


నేడు రాష్ట్రంలోని మీడియా మయసభను తలపిస్తోంది.సామాన్యుడు పేపర్లలో,టీవీలలో వస్తున్న విషయాలను ఏది నమ్మాలో ,ఏది నమ్మకూడదో తెలియక చిత్తైపోతున్నాడు.దీనికి కారణం మీడియాలో అధికభాగం నిజాలను పక్కనపెట్టి వార్తలను తమకు అనుకూలంగా రాసుకుంటూ పోతూ అది జనం చేత నమ్మించే ప్రయత్నం చేయడమే. మీడియా సర్క్యులేషన్లు, టీఆర్పీలు పెంచుకుంటూ హేపీగా ఉంది.ప్రజలే ఫూల్స్ అయిపోతున్నారు.
కొన్ని పేపర్ల్లు,చానల్స్ మరణించినా వైఎస్ ను వదలలేదు.
కొన్ని వ్యతిరేఖంగానే రాస్తున్నాయి. కొన్ని అనుకూలంగానే రాస్తున్నాయి.కాబాట్టి ఏ వార్తను నమ్మలో ,ఏ వార్తను నమ్మకూడదో తెలియని గందరగోళంలో పడిపోయాడు పాఠకుడు.
ఎప్పుడో నెలలముందు రష్యన్ పత్రిక రాసిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టాల్సిన పని ఏముంది? అప్పుడె ఎందుకు బయటపెట్టలేదు?
రోశయ్య పదవి దిగేంతవరకు ఈ అల్లర్లు ఆగవా?
కొన్ని పేపర్లు ఈ వార్తను అస్సలు పట్టించుకోవద్దని చెబుతున్నాయి ! ఇందులో వాటి ప్రయోజనమేమిటో? తాము రాస్తే యెల్లో వార్త కాదు..ఇతరులు రాస్తే యెల్లో వార్తా!
కానీ ఆ వార్తను పూర్తిగా సత్యదూరం అనడానికి కూడా లేదు.
ఏ కుట్రా లేకపోతే బ్లాక్ బాక్స్ లోని విషయం ఇప్పటి దాకా ఎందుకు బయటకు రాలేదు?
పదకొండు గుళ్ళు ఉండాల్సిన వెస్లీ తుపాకీ లో ఆరే ఎందుకున్నాయి? మిగిలినవి ఏమయ్యాయి?
అందరి దేహాలు పేలిపోతే భాటియా దేహం మాత్రం ఎందుకు బాగుంది? భాటియా కుమారులు రిలయెన్స్ లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారంటున్నారు? అది ఎంతవరకు నిజం?
అసలు విచారణ సక్రమంగా జరగడం లేదని ప్రతి ఒక్కరికీ తెలుసు? దాని వెనుక ఏమైనా కుట్ర ఉందా?
అనిల్ అంబానీ హెలికాప్టర్ ఇంజన్ లో ఇసుక పోయబడిన విషయం ,ఆ ఇంజనీరు హత్య చేయబడడం వాస్తవం కాదా?
అనిల్ ఆరోపణ నిజం అనుకుంటే ..స్వలాభం కోసం రక్తసంబంధాన్నే బలి పెట్టబోయిన వ్యక్తి ఎంతకైనా తెగించడా?
రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, మీడియా ప్రముఖులు తమలాభం కోసం పన్నుతున్న రాజకీయ కుట్రలు,కుతంత్రాల్లో ఆంధ్ర దేశంలోని సామాన్యుడు సమిధగా మారాడు! అతని బ్రతుకు రానున్న రోజుల్లో మరింత భారంగా మారనుంది!