newstirupati.ccom home
YSR Murder?

ysr

 

మహా నేత మరణం వెనుక ముఖేష్ సొదరుల హస్తమా?
ఇది నిజమా!నిజమే గనుక అయితే ఆ బ్లడీ బిజినెస్ మాన్స్ ని ి ఏ విధంగా శిక్షించాలి?
ఆంధ్ర సాగరతీరంలో దొరికిన గేస్ లో రాష్ట్రానికి వాతా ఇవ్వవలసి వస్తుందన్న ఉద్దేశంతో వై ఎస్ ఆర్ ను ముఖేష్ అంబానీ హత్య చేయించాడని రష్యన్ పత్రిక ఎక్సైల్ కథనం.
తమ్ముడు అనిల్ అంబానీ ని హత్య చేయడానికి కూడా హెలికాప్టర్ ను వాడుకున్నాడని ,ఇంజన్ లో ఇసుక పోయించాదని స్వయంగా అనిల్ అంబానీ నే చెప్పిన విషయం ఈ అనుమానాన్ని కొంత బలపరుస్తోంది.
ప్రపంచంలో ఏడవ ధనవంతుడిగా ,ఎన్నో వేల కోట్లు ఉన్న ముఖెష్ అంబానీ ఇంకా ధనాన్ని ఏం చేసుకుంటాడు? అతనిది ధన దాహమా? రక్త దాహమా?
అసలు ముఖేష్ లో అటువంటి రాక్షసుడున్నాడా?
ఏది నిజం?
వైఎస్సార్ ది యాక్సిడెంటల్ మరణమా? ముఖేష్ సోదరులు చేయించిన హత్యా?
అసలు అంతా నిర్లక్ష్యం .వైఎస్సార్ మరణం వెనుక కారణాన్ని ఎవరైనా సక్రమంగా శోధించారా?ఇండియన్ అధికారులను అందుకె అంత చీప్ గా చూస్తారు!వీరిలో సక్రమంగా పని చేసే వారు ఎందరున్నారు?
ఒక పవర్ ఫుల్ ముఖ్యమంత్రి మరణానికే దిక్కు లేకపోతే ఇక సామాన్యుడి విషయంలో ఈ దేశంలో ,ఈ రాష్ట్రంలో ఏం న్యాయం జరుగుతుంది?
ఒక వ్యక్తికి తన గేస్ డబ్బుల కోసం ,కేవలం తన ఒక్కడి లాభంకోసం పదికోట్ల ప్రజల ఆంధ్ర దేశపు భవిష్యత్తును హత్య చేసే అధికారం ఎక్కడుంది?అదె గనుక నిజమైతే అతనికి అతి నికృష్టమైన శిక్ష రాసిపెట్టబడే ఉంటుంది!
ఏదినిజం అని తేలకుండా ఎవరినీ నిందించకూడదు!
అసలు ఏది నిజం అన్న విషయం మన అధికారులు ,రాజకీయ నాయకులు వచ్చేజన్మలోనైనా తేలుస్తారా? లేదా ఇలాగే నాంచి మూలన పడేస్తారా?
కానీ ఒకటి నిజం!ఈ రాష్టానికి ఏదో పోగాలం దాపురించింది!
వైస్ మరణం తో అది ప్రారంభమైంది.
వరదలు..
తెలంగాణ గొడవలు..
ఆంధ్ర బంద్ లు..
ఆర్టిసి చార్జీల పెంపు.. యాదవ్ గారి కామెంట్లు ..
త్వరలో పెరగబోయే కరెంటు చార్జీలు ..పన్నులు..
ఇప్పుడు మరణం వెనుక విషాదం ..
వైఎస్ ఉండి ఉంటే ఎంత బాగుండేది!
ఖచ్చితంగా ఈ ఐదేళ్ళలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందేది.
ఆర్టీసి చార్జీలు,కరెంటు చార్జీలు పెరగడానికి వైఎస్ ఒప్పుకునేవాడు కాదు.
విధి ని ఆంధ్ర ప్రజలు ఏ మాత్రం క్షమించరు!